Ninnu Chusake

నిన్ను చూశాకే నిన్ను చూశాకే
నాలోన ఏమైందో నిన్ను చూశాకే
నవ్వు చూశాకే నవ్వు చూశాకే
నీ మీద ప్రేమైందో నవ్వు చూశాకే
అంతగా ఏముందో నీలో
గీసానే నీ బొమ్మ నాలో
ప్రేమతో ఇంకేం అనాలో తేల్చేశావే గాల్లో
ఇంతలో ఏం చేసినావో
గుండెల్లో దూకేసినావో
చూపుతో చంపేసినవో ఏం చేశావో
ఎంతగా నచ్చావే పిల్లా
అందుకే పడ్డానికిల్లా
ఎంతగా నచ్చావే పిల్లా
ఆగదే గుండెల్లో గోల

ఏనాడు కనలేదు ఈ వింతనీ
నను కూడా నే పోల్చలేదేంటని
నిను దాటి నేను అడుగేయలేను
నువు లేని కల కూడా నే చూడలేను
ఈ ఊహకే నా గుండెలో
ఎన్నెన్ని రాగాల కేరింతలో

ఎంతగా నచ్చావే పిల్లా
అందుకే పడ్డానికిల్లా
ఎంతగా నచ్చావే పిల్లా
ఆగదే గుండెల్లో గోల

నిన్ను చూశాకే నిన్ను చూశాకే
నాలోన ఏమైందో నిన్ను చూశాకే

ఈ ఊపిరి నీకు పంచాలని
నా ప్రేమ నీ వైపు అడుగేయని
ఎవరేమి అన్నా ఈ మాట నిజమే
ఇక వీడదీనీడ నీ స్నేహమే
నీదే కదా ఈ ప్రాణమే
నీతోనే నిండింది నా లోకమే

ఎంతగా నచ్చావే పిల్లా
అందుకే పడ్డానికిల్లా
ఎంతగా నచ్చావే పిల్లా
ఆగదే గుండెల్లో గోల

నిన్ను చూశాకే నిన్ను చూశాకే
నాలోన ఏమైందో నిన్ను చూశాకే



Credits
Writer(s): Shekar Chandra, Vanamali
Lyrics powered by www.musixmatch.com

Link