DOORAM (feat. Chaitra Ambadipudi) [From "Rallalo Neeru"]

దూరం
ఎంతెంత దూరం
తీరం చేరేది భారం

దూరం
ఎంతెంత దూరం
తీరం చేరేది భారం

కాలం చాలక అందరం
మొహం తీరని చందం

దూరం
ఎంతెంత దూరం
తీరం చేరేది భారం

వెలుగు వరం తిమిరంలో
మనిషి బలం
బ్రతుకు ఫలం మమకారం
చెడదు నిజం
రేయి గడచిన తారలం
దారి మరచిన దీనులం
అందిన తీరం
ఎంతకీ చేరం
అందుకే చాలు విహారం

దూరం
ఎంతెంత దూరం
తీరం చేరేది భారం

మదికి వరం చెలికారం
తెలిసి మనం
మసలు క్షణం కలకాలం
నిలుచు నిజం
రాతి మరుగున నీరులం
లోన నిలిచిన ప్రేమలం
అందుకో జాలం
అందుకే దూరం
ఇంతకీ లేదు విచారం

దూరం
ఎంతెంత దూరం
తీరం చేరేది భారం

దూరం
ఎంతెంత దూరం
తీరం చేరేది భారం



Credits
Writer(s): Indraganti Srikanta Sarma, Vivek Sagar
Lyrics powered by www.musixmatch.com

Link