Gaaju Bomma Teeruna (From "Atithi Devobhava")

గాజు బొమ్మ తీరున
చూసే గుండె నీదిరా
గాయమైతే చూడలేవు
గారమంటె నీదిరా

ఎంత ఎంత కోరినా
అంతులేని ప్రేమరా
గాలినైన తాకనీవు
గారమంటె నీదిరా
చేతులెంత చాచినా మాటతీరు మారదే
వేచి చూసే కౌగిలే వచ్చి చేరెరా
నా కోపమైనా కోరికైనా
ఒక్క నీకే చెప్పుకోనా
గుండెలోన ఊపిరైనా
ఆగుతున్నా చుట్టుకోనా
నిమిషమైన ఉండలేను
నువ్వు లేని భూమిపైనా
దేహమైనా వీడిపోనా నిన్ను
నేనే నింపనా
గాజు బొమ్మ తీరున
చూసే గుండె నీదిరా
గాయమైతే చూడలేవు
గారమంటె నీదిరా

ఏ రోజిలా కాలేదులే
పాదాలిలా తేలాయిలే
ఏం చేసినా నీ మీదకే
తోసేస్తోంది నేలే
బాగుంది ఈ అల్లరే
చిత్రంగా ఉన్నా సరే
వద్దన్నా నీ ఊహలే
గుండెల్లో ఊరికే వాలే
ఏ కోపమైనా కోరికైనా
ఒక్క నీకే చెప్పుకోనా
గుండెలోన ఊపిరైనా
ఆగుతున్నా చుట్టుకోనా

నీ ప్రేమలో ఓ నమ్మకం
చూశానులే ఈ లోపలే
పిల్లాడిలా అల్లేయడం
నచ్చేసింది నాకే
చూసేస్తా నీ నవ్వులే
దాచేస్తా కాలాలనే
సాగిస్తా నీ స్నేహమే
నీడల్లే మారనా నీకే

నా కోపమైనా కోరికైనా
ఒక్క నీకే చెప్పుకోనా
గుండెలోన ఊపిరైనా
ఆగుతున్నా చుట్టుకోనా
నిమిషమైన ఉండలేను
నువ్వు లేని భూమిపైనా
దేహమైనా వీడిపోనా నిన్ను
నేనే నింపనా



Credits
Writer(s): Anumolu Chandrashekar, Gundagani Krishnakant
Lyrics powered by www.musixmatch.com

Link