Singhamu Pai Langhinchenu (Kadhaa Gaanam) [From "Gautamiputra Satakarni"]

హే సింగముపై లంగించెను బాలుడు పేరు శాతకర్ణి
సూరి కళ్లెముగ సవారి చేసెను పేరు శాతకర్ణి
ముసి ముసి నగవుల పసివాడా
సింగము ననచిన మొనగాడా
సింగము ననచిన మొనగాడా
సింహవాహనుల పరంపర పేరును నిలిపిన వారసుడా
పేరును నిలిపిన వారసుడా

ధింత తక తక ధిం ధిం ధిం తక తక ధిం ధిం
ధిం తక తక తక ధిం తక తక తక ధింత ధింత ధిన్ ధిన్
ధిం తక తక తక ధిం తక తక తక ధింత ధింత ధిన్ ధిన్

అలా బాలుడా భానుడా అన్న చందాన
శాతకర్ణి ఎదుగుతున్నాడు
అమర శాతవాహనుల ఆశలు
ముక్కోటి దేవతల ఆశీస్సులు
తల్లి గౌతమి బాలా శ్రీదేవి ఆశయాలు కలిసి
దిన దిన ప్రవర్ధమానమవుతున్నాడు
గౌతమి మాత గోరుముద్దలే
వీర సుద్దులాయే (వీర సుద్దులాయే)
కత్తులు అమ్ములు శర శూలమ్ములు
ఆట బొమ్మలాయే (ఆట బొమ్మలాయే)

పదునెనిమిదేళ్ళ ప్రాయమందు
పట్టాభిషిక్తుడాయే (పట్టాభిషిక్తుడాయే)
జయహో శాతకర్ణి సార్వభౌమా జయహో
జయహో శాతకర్ణి సార్వభౌమా జయహో
అప్పుడే పట్టాభిషక్తుడైతే మరి పెల్లో
వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా
ఇష్ట సఖి విశిష్ట సఖి
మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి
ఇష్ట సఖి విశిష్ట సఖి
మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి
పాల నవ్వుల తల్లి మల్లే వెన్నెల వల్లి
మనువాడ వచ్చే వాసిష్టి సఖి
ఇంత చక్కని జంట పూర్వ పుణ్యాల పంట
ఇంకేడా కానరాదు మన కళ్ళకి
చూపు తగలకుండా కష్టం కలగకుండా
దిష్టి తీయరమ్మ ఆ జంటకి
ఇష్ట సఖి విశిష్ట సఖి
మనసిచ్చింది చూడు వాసిష్టి సఖి
ఇంత దిష్టి తీశాక కష్టం
ఎందుకుంటుంది మిత్రమా
లేదు లేదు ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి
ఆ జంటకి కష్టం ఎదురయింది
అడుగడుగడుగో క్రూరుకు కపటుడు క్షహారాదరాసుడా
మాధాందుడు అధముడు దృష్ట
నికృష్ట నెహపాణ రాజురా
సాటి రాజు బెదరంగ
యువరాజుల దోచే దొంగ
బిడ్డల బతుకుల బెంగాటనతో
యుద్ధమంటే బెదరంగ
వాహ్ ఎట్టెట్టా
చుట్టుపక్క రాకుమారుల్ని ఎత్తుకెళ్ళి
నా మీద యుద్దనికొస్తే
మీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని
బెదిరిస్తున్నాడా నెహపాణుడు
ఈ హెచ్చరిక శాతకర్ణుల వారిదాకా వెళ్లిందా
అమ్మాశయం తీర్చంగ ఖండాలన్ని కలుపంగా
జైత్ర యాత్రలో భాగంగా
దూతను పంపెను ధర్మంగా
ఓ నెహపాణా నీ కత్తిని
మా దూతకిచ్చి శరణు వేడితే
మాకు సామంతుడిగా బ్రతకానిస్తానన్నాడు శాతకర్ణి
అప్పుడు ఆ పాపి నెహపాణుడు ఏమన్నాడు
నీ కన్నబిడ్డడు పులోమపాలుడ్ని
పంపించమన్నాడు పంపించమన్నాడు
కొమరుణ్ణి అర్పించి శరణు కోరమని
కబురు పంపినాడు కబురు పంపినాడు
శాతకర్ణి మహరాజందుకు సరేనని బదులంపినాడు
శాతకర్ణి మహరాజందుకు సరేనని బదులంపినాడు
ఆశ్చర్యం ఆశ్చర్యం అజేయుడు అపరాజితుడు
అవక్ర పరాక్రముడైన శాతకర్ణి మహారాజు
కన్న బిడ్డను శత్రువుకు
అప్పగించడానికి ఒప్పుకున్నాడా
మేము నమ్మం
కానీ నిజం
ఆ మహారాజు ఆంతర్యం ఏమిటో
ఆ ఆంతర్యానికే తెలియాలి

అయ్యో మరి ఆ తల్లి
వాసిష్టి దేవి ఏమౌనో కదా
అయ్యో భర్త మనసులో ఎమున్నదో
బిడ్డకు ఏమికానున్నదో



Credits
Writer(s): Chirrantan Bhatt, Sai Madhav
Lyrics powered by www.musixmatch.com

Link