Srimalle Puvvalle

సిరిమల్లి పువ్వల్లే నవ్వులే చల్లుతూ
ఆనందం పొందాలి ఆడుతూ పాడుతూ
అపురూపమైనది ఈ లోకము
నూరేళ్ల అధికులం మనమందరం
ఈ కుకూల సందల్లే సాగాలి
మన జీవితం
(గుండెలోన కోరికున్నది)
(నింగి దాక వెళ్లమన్నది)
(కొత్త గొంతు విప్పమన్నది)
(కోయిలల్లే కూయమన్నది)
సిరిమల్లి పువ్వల్లే నవ్వులే చల్లుతూ

(నన్ననన్న నానే నన్న నానే)
(తనన తానే తంద తానే)
(నన్ననన్న నానే నన్న నానే)
(తనన తానే తంద తానే)

లేలేత అరిటాకు అమ్మాయేనని
అనుకుంటే మన పరువు వెనుకవుతుందని
ఎదురొచ్చే అవకాశం మనకే అనుకొని
ఎదురెల్లి సందిస్తే గెలుపే మనదని
మానానే నేర్పిన చిననాటి మాటిది
తన వేలే చూపిన
విజయాల బాటిది
మా నాన మాటంటే
శ్రీ కృష్ణ గీతంటిదే
(మనసు నిండా ఆశలున్నవి)
(మళ్లీ మళ్లీ పొందడానికే)
సిరిమల్లి పువ్వల్లే నవ్వులే చల్లుతూ
ఆనందం పొందాలి ఆడుతూ పాడుతూ

ఇంటింటా తానుండే వీలే లేదని
పంపించే ఆ దైవం తల్లీతండ్రని
మన నీడ మనదంటూ అనుకోకెన్నడూ
అది నాన కనుపాప చలువే ఎప్పుడూ
తన రక్తం పంచిన
ప్రతి తల్లీ దేవతే
అనుబంధాలల్లిన ప్రతి ఇల్లు స్వర్గమే
మా నాన గుండెల్లో గువ్వంటే నేనేనులే
(అమ్మ నాన ఎదురు చూపుతో)
(రైలు వేగమందుకున్నదే)

చిన్నారి నెలవంకా స్వాగతం స్వాగతం
నీతోనే మాకింక జీవితం జీవితం
నను కన్న తల్లివి నా కంటికి
నువ్వు వెన్నెలమ్మవి మా ఇంటికి
నీ కాలి మువ్వల్లే మా గుండె మోగిందిలే

చిన్ని నవ్వు నువ్వు నవ్వితే
జాబిలమ్మ మాకు ఎందుకే
నాన అంటూ నన్ను చేరితే
ప్రాణమింక లేచి వచ్చునే



Credits
Writer(s): S.a. Rajkumar, Sudhaala Ashok Teja
Lyrics powered by www.musixmatch.com

Link