Cheruvalo Levu (feat. East Coast Vijayan & Manjari)

ప్రియా ఓ ప్రియా

నా ప్రియా

చేరువలో లేవు దూరము కాలేవు
ఎచట నే వెతుకను తెలియదులే
నిన్ను ఎచట నే వెతుకను తెలియదులే
చేరువలో లేవు దూరము కాలేవు
ఎచట నే వెతుకను తెలియదులే
ఏకాంత దేశాన నీ చెంత చేరి
నీ ఆమని పవనమై అల్లుకోనా
ఏకాంత దేశాన నీ చెంత చేరి
నీ ఆమని పవనమై అల్లుకోనా
చేరువలో లేవు దూరము కాలేవు
ఎచట నే వెతుకను తెలియదులే

నీకై వేచేటి నా వేడి నిట్టూర్పులో
సుగంధమో ఒక వింత మైకమో
చూచితివి ఎదనే దోచితివి
నీకై వేచేటి నా వేడి నిట్టూర్పులో
సుగంధమో ఒక వింత మైకమో
చూచితివి ఎదనే దోచితివి
చేరువలో లేవు దూరము కాలేవు
ఎచటనో దాగితివి
ఓ ప్రియా ఎచటనో దాగితివి
చేరువలో లేవు దూరము కాలేవు
ఎచట నే వెతుకను తెలియదులే

నీకే తెలియక నీ మది హరివిల్లులో
వర్ణాలను రంగుల స్వప్నాలను
దోచుకున్నా నాలో దాచకున్నా
నీకే తెలియక నీ మది హరివిల్లులో
వర్ణాలను రంగుల స్వప్నాలను
దోచుకున్నా నాలో దాచుకున్నా
నీకే తెలియక నిన్నే తలవక
నీ తలపులు నే లాలించాను
నీ ప్రేమ సామ్రాజ్యం పాలించాను
చేరువలో లేవు దూరము కాలేవు
ఎచటనో దాగితివి
ఓ ప్రియా ఎచటనో దాగితివి

చేరువలో లేవు దూరము కాలేవు
ఎచట నే వెతుకను తెలియదులే
ఏకాంత దేశాన నీ చెంత చేరి
నీ ఆమని పవనమై అల్లుకోనా
ఏకాంత దేశాన నీ చెంత చేరి
నీ ఆమని పవనమై అల్లుకోనా
చేరువలో లేవు దూరము కాలేవు
ఎచట నే వెతుకను తెలియదులే



Credits
Writer(s): East Coast Vijayan, Vijay Karun
Lyrics powered by www.musixmatch.com

Link