Inthandham

ఇంతందం దారి మళ్ళిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్పసంపద
జగత్తు చూడని
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి తరించే తపస్సిలా
నిశీదులన్నీ తలొంచే తుషారాణివా

(విసుక్కునే వెళ్ళాడు చందమామయేనే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటితారలేనే
నీకంత వెన్నెలేంటనే)

నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరి
వీడే వీలులేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరి
నదిలా దూకేటి నీ పైట సహజగుణం
పులిలా దాగుండి వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే

(విసుక్కునే వెళ్ళాడు చందమామయేనే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటితారలేనే
నీకంత వెన్నెలేంటనే)

చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయెనా
విల్లే ఎక్కుపెట్టి
మెళ్ళో తాళికట్టి
మరలా రాముడవ్వనా
అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే

(విసుక్కునే వెళ్ళాడు చందమామయేనే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటితారలేనే
నీకంత వెన్నెలేంటనే)



Credits
Writer(s): Kanth Gundagani Krishna, Chandrasekar Vishal
Lyrics powered by www.musixmatch.com

Link