Jai Balayya Mass Anthem (From "Veera Simha Reddy")

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల... రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి... తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు... నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా

జై బాలయ్య... జై బాలయ్యా
జై జై బాలయ్య... జై బాలయ్యా
జై బాలయ్య... జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా

(జై బాలయ్య... జై బాలయ్యా
జై జై బాలయ్య... జై బాలయ్యా
జై బాలయ్య... జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా)

రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు

గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

ఏ, తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నీ ఆవేశం

నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా

పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు పొద్దుల్లోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా

జై బాలయ్య... జై బాలయ్యా
జై జై బాలయ్య... జై బాలయ్యా
జై బాలయ్య... జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా



Credits
Writer(s): Darivemula Ramajogaiah, Sai Srinivas Ghantasala
Lyrics powered by www.musixmatch.com

Link