Emai Pothane

ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
అరెరే నా జగమంటూ నీ సగమంటూ వేరుగ లేదంటే
అదిరే గుండెల చుట్టూ కావలి కాస్తూ ఊపిరినివ్వాలే

ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే

తెలియదుగా
తెగ తొందర చేసిన వయసుకి అసలు కథ
ఒక మాటని పలకని పెదవుల ఎదురుగ
కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే
మనసులు మళ్ళీ మళ్ళీ లొంగిపోవాలే
లేనిపోని ఆటలేమిటో
నిన్ను నన్ను ప్రేమలోకి లాగుతున్నాయే

అరె' ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే

గడవదుగా
ఒక నిమిషము గుండెకు నీ సడి వినపడక
నిను వెతికిన తలపులు అలసిన క్షణమిక
నన్ను కొట్టి ఆడుకోమాకే
ఉన్నట్టుండి నన్నే వీడి వెళ్ళిపోమాకే
నీలో నేనే ఉన్నట్టున్నానే
తొంగిచూడు నువ్వేలేని నేనై ఉంటానే

అరె' ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే
అరెరే నా జగమంటూ నీ సగమంటూ వేరుగ లేదంటే
అదిరే గుండెల చుట్టూ కావలి కాస్తూ ఊపిరినివ్వాలే

ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే
ఆశల అంచులపై చిలిపిగ నువ్వడుగేస్తుంటే



Credits
Writer(s): Praveen Lakkaraju, Sreejo
Lyrics powered by www.musixmatch.com

Link