Lipileni Kanti Bhasha

లిపిలేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా ఇలా చదవనీ
నీ లేఖనీ ప్రణయలేఖని
బదులైన లేని లేఖ
బ్రతుకైన ప్రేమలేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ
నా లేఖనీ ప్రణయలేఖని

లిపిలేని కంటి బాస
తెలిపింది చిలిపి ఆశ

అమావాస్య నిశిలో
కోటి తారలున్న ఆకాశం
వెలుగుతోంది వేదన తానై
విదియనాటి జాబిలి కోసం
వెలుగునీడలెన్నున్నా
వెలగలేని ఆకాశం... ఊ
ఎదుగుతూ ఉంది వెన్నెల తానై
ఒక్కనాటి పున్నమి కోసం

లిపిలేని కంటి బాస
తెలిసింది చిలిపి ఆశ

అక్షరాల నీడలలో
నీ జాడలు చూసుకుని
ఆ పదాల అల్లికలో
నీ పెదవులు అద్దుకుని
నీకంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడప దాటలేక నన్నే
గడియ వేసుకున్నాను
గడియైన నీవు లేక
గడపలేక ఉన్నాను

బదులయిన లేని లేఖ
బ్రతుకయిన ప్రేమ లేఖ
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా ఇలా రాయనీ
నీ లేఖనీ ప్రణయలేఖని

లిపిలేని కంటి బాస
తెలిసింది చిలిపి ఆశ



Credits
Writer(s): Naidu P Ramesh, Veturi Sundara Rama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link