Chamkeela Angeelesi

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకులెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు అయినా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే

చినిగిన బనీనేసి ఓ వదినే
నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే
మాసిన లుంగీ ఏసి ఇప్పుడు
మంచంలనే పంటడే

పెండ్లయిన కొత్తల అత్తర్లు పూసిన్నే
నీ సీర చెంగులు పట్టి ఎనకెనక తిరిగిన్నే
ముద్దులిస్తుండే పూలు తెస్తుండే
సెక్కర లెక్క నీ మాటలుంటుండే
మారే నీ తీరు పెరిగే నీ నోరు
మందుకలవాటైతినే

కడుపులో ఇంత పోసి ఓ వదినే
కొడతడే బండకేసి ఓ వదినే
అమవాస పున్నానికో అట్లట్లా
అక్కరకు పక్కకొత్తాడే

చమ్కీల అంగీలోడే
నాకు జుంకీలు అన్న తేడే

వీడు వంటింట్ల నేనుంటే
చాటుంగా వత్తుండే
వంకర నడుము గిచ్చుతుండే
నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే
తైతక్కలాడకంటుండే

కంట నీరన్న పెట్టకుండ
సంటిబిడ్డలెక్క నిన్ను
అలుగుతుంటే బుదరగియ్యలేదా
నువ్వు సీటికి మాటికి
గింతదాన్ని గంతజేసి
ఇజ్జతంత బజార్లేస్తలేవా

ఏ గాలి సోకెనో ఈ నెత్తి దిరిగెనో
పాతబడ్డనేమో చేతనైతలేదో
ఉల్టా నన్నిట్ల మందిముంగట్ల
బదనాం చేత్తడే

చమ్కీల అంగీలేసి ఓ వదినే
చాకులెక్కుండేటోడే ఓ వదినే
కండ్లకు అయినా బెట్టి
కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే

నోరిడిసి అడగరాదురా బామ్మర్ది
చెప్పింది చెయ్యదురా బామ్మర్ది
పక్కింటిలా కూసుంటది నామీద
చాడీలు చెప్తుంటాది

నా గొంతు కోసిరంటూ బామ్మర్ది
శోకాలు పెడుతుంటాది బామ్మర్ది
ముచ్చట్లు చెప్పబోతే మీ అక్క
మూతంతా తిప్పుతుంటది

సీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా
కంటికి రెప్పోలే కాస్తడు మొగడు
ఎంతలోల్లయినా నువ్వెంట ఉంటే
ఎదురునిలిసి వాడు గెలిసి వస్తాడు

గోసల్ని చూస్తా ఉన్నా ఏదైనా
గుండెల్ల దాస్తాడులే
నీ బొట్టు నీ గాజులే ఎంతైనా
వాని పంచపాణాలులే



Credits
Writer(s): Kasarla Shyam, Cetlur Rajagopalan Santhosh Narayanan
Lyrics powered by www.musixmatch.com

Link