Nachavule Nachavule (From "Virupaksha")

నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటెవేషాలే చూశాకే

తడబడని తీరు నీదే
తెగబడుతూ దూకుతావే
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే

ఏ' నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే

కపటి కపటి కపటి కపటి
కపటి కపటి కపటి కపటియా

అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే
పొగరుకే అణకువే అద్దినావే
పద్ధతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే
అమ్మడూ నమ్మితే తప్పు నాదే
నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే

నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే

పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే
మనసుకే ముసుగునే వేసినావే
కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే
లోపలో లోకమే ఉందిలేవే
నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే

తడబడని తీరు నీదే
తెగబడుతూ దూకుతావే
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే

నచ్చావులే నచ్చావులే
ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే
నీ కొంటె వేషాలే చూసాకే



Credits
Writer(s): Krishna Kanth Gundagani, B L Ajaneesh
Lyrics powered by www.musixmatch.com

Link