Jaathara (From "Rudramambapuram")

ఓ రామయ్యను ఎద నిలిపి
జాలమ్మను మది కొలిచి
గంగమ్మకు హారతిచ్చి
ఔఅమ్మకు మొక్కు తీర్చే జాతర

గంగమ్మనే నమ్మేటోళ్లం
కడలమ్మ గుండెల్లో బతికేటోళ్లం
అలుపన్నదే ఎరగని వాళ్లం
మెరుపేగం ఓలె వల విసిరేటోళ్లం
అల్ల రాకాసి అలలొచ్చిన
బెదరని వాళ్లం
పిల్ల సుడిగుండం చుట్టేసిన
చెదరని వాళ్లం
సుర్రు సూరీడే దిక్సూచిగ నడిసేటోళ్లం
సల్ల సూపున సంద్రుడే నేస్తం
హలే హలే హైలెస్సో కూతెడతాం
మా పిల్లా పాప ఆలి
నొగ్గి బయిదెలదాం

ఏ ఎగిసిపడే కేరటాలకి ఎదురెళ్తాం
నడి సంద్రంలో తీరాలే దాటెళ్తాం

మాటలెన్ని ఉన్నానుగాని
పాట ఒక్కటే మా అందరిది
ప్యానమైనా పోయినగాని
నీతి మాకు వెన్నంటిది
కట్టుబాటుల జెలియల కట్టా
ఆచారాలే మాకు దిట్టా
పెద కాపు తీర్పుల
శాసనాలా గడ్డ
మాటే తప్పని జాతేనంటా
తలరాతను ఆ దేవుడే రాయంగా
అరే జరిగేది జరగక ఆగేనా
కెరటం పై మా పయనమే గెలవంగా
అరే మా ఇంట చిరుదీపం వెలిగేనా
హలే హలే హైలెస్సో కూతెడతాం
మా పిల్లా పాప ఆలి
నొగ్గి బయిదెలదాం

ఏ ఎగిసిపడే కేరటాలకి ఎదురెళ్తాం
నడి సంద్రంలో తీరాలే దాటెళ్తాం

కడలి గట్టు గుట్టుని ఎరిగినా
పట్ట భద్రులమే మేమందరం
ఆటు పోటు లెన్నెన్ని వచ్చినా
ఎదురు ఈతే మా జీవనం
కల్తీ లేని మత్స్యకారులం
సత్యంగా నడిచే జాలరులం
ఎందరు వచ్చి సంద్రాన్ని దోచినా
కడలే వీడి కదలనే కదలం
జాలమ్మను నమ్ముకున్న వాళ్లమురా
అరే ఎవడొచ్చిన భయపడము మేమింకా
గంగమ్మ సూడు తల్లి సల్లంగా
తల్లి జాతరలే చేస్తాము నీకింకా

హలే హలే హైలెస్సో కూతెడతాం
మా పిల్లా పాప ఆలి
నొగ్గి బయిదెలదాం



Credits
Writer(s): Vengi, Bhashya Sree
Lyrics powered by www.musixmatch.com

Link