Priyathama (From "Idandi Mavari Varasa")

ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా

శిలలాంటి నాకు జీవాన్ని పోసి
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంట మాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతిలయ లాగా జత చేరినావు
నువులేని నన్నూ ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమ
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా

నీ పెదవిపైన వెలుగారనీకు
నీ కనులలోన తడిచేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అది వెల్లువల్లే నను ముంచనీకు
ఏ కారు మబ్బూ ఎటు కమ్ముకున్నా
మహా సాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోన ఎడబాటు లేదు
పది జన్మలైనా ముడే వీడిపోదు
అమరం అఖిలం మన ప్రేమ
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా
నను మనిషిగా చేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా



Credits
Writer(s): Chakri, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link