Antaaniddura Poye Velaendi (From "Akka Bagunnava")

అంతా నిద్దుర పోయే వేళైయింది
అయినా లోపల ఏదో గోలైయింది
పోనీ సంగతి చూద్దామంటే
ఛీ ఛీ పొమ్మంటారే ఓ వెన్నెలా
తప్పుకోమంటూ తలుపేసారే
ఒప్పుకోనంటే తరిమేసారే
గదిలో ఆమూల అంత
వింత ఏముందో

అంతా నిద్దుర పోయే వేళైయింది
అయినా లోపల ఏదో గోలైయింది
పోనీ సంగతి చూద్దామంటే
ఛీ ఛీ పొమ్మంటారే ఓ వెన్నెలా

చక్కని పిల్లా సిగ్గుల మల్లా
అక్కడే ఆగిందో పక్కకి చేరిందో
ఇద్దరి మద్య ఎవ్వరూ లేక
చిక్కలు పడ్డారో సర్దుకు పోయారో
చల్ల గాలి నీకే కొంచం
తాకిందే తల్లి
చేతనైతే నువ్వూ వెళ్లి
చూడే జాబిల్లి
తెల్లవార్లూ అక్కడుంది ఆ అల్లరి పిల్లల
వెచ్చని ఊసులు నాకూ చెప్పండి

అంతా నిద్దుర పోయే వేళైయింది
అయినా లోపల ఏదో గోలైయింది
పోనీ సంగతి చూద్దామంటే
ఛీ ఛీ పొమ్మంటారే ఓ వెన్నెలా

పక్కను వేసా మల్లెలు పోసా
చక్కగ ఉంచారో చిత్తుగ చేశారో
అత్తరు సీసా కొత్తది తీశా
ఒంటికి రాశారో దిండుకి పూశారో
దీపమైనా ఉందో లేదో
పాపం పసివాళ్లు
చీకటింట్లో ఏమౌతారో అసలే కొత్తాళ్లు
పాలు ఉన్నా పండ్లు ఉన్నా
అవి చూసే ద్యాసే ఉందో లేదో
చెప్పే వాళ్లెవరు

అంతా నిద్దుర పోయే వేళైయింది
అయినా లోపల ఏదో గోలైయింది
పోనీ సంగతి చూద్దామంటే
ఛీ ఛీ పొమ్మంటారే ఓ వెన్నెలా
తప్పుకోమంటూ తలుపేసారే
ఒప్పుకోనంటే తరిమేసారే
గదిలో ఆమూల అంత
వింత ఏముందో



Credits
Writer(s): Koti, Seetharam Shastri
Lyrics powered by www.musixmatch.com

Link