Anukonide (From "Prema Sandadi")

అనుకోనిది, అనలేనిది ఒక హాయి ఏదేదో
నిను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో
నేనున్నది నీకోసమె, సందేహమే లేదు
నిను చుసిన నా కంటికి నిదురన్నదే రాదు
నీ చూపుల వేకువలో
నీ నవ్వుల వెన్నెలలో
ఒక వెచ్చదనం
ఒక చల్లదనం
నీ ప్రేమ ధనం దొరికే ఓ ఓ ఓ ఓ
ఓ మైనా ఓ మైనా
ఓ మైనా ఓ మైనా
అనుకోనిది, అనలేనిది ఒక హాయి ఏదేదో
నిను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో

మెళకువలో కల కనడం నేర్పిన ప్రేమకు జోహారయ్య
నా ఎదలో సవ్వడిగా నీ పేరే పలికింది ప్రియ
ఎందుకనో ఇద్దరిలో సందడి చేసెను ఒకే లయ
అందుకనే ఇద్దరమూ ఒకటేనని జతనయ్యా
ఎటో ఎటో తేలె ఎదో ఎదో హాయి
ఓ రమణి! రమ్మనని
నీ మనసే విననీ కననీ
నీ జతని కోరుకొని, సై అనని, ఒడిలో పడని
అనుకోనిది, అనలేనిది ఒక హాయి ఏదేదో

నిను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో

కలవరమో, కలకలమో ఇదివరకెరుగని ఎదో ఇది
జిలిబిలిగా, బిగిబిగిగా అల్లిన ఊహల అల్లరిది
అలికిడినే చేయకనే వచ్చిన ప్రేమకు సలాం అని
మన మనసే ఏలుకొనే హక్కే తనదని అననీ
అటు ఇటు ఊగే మనస్సులో ఆశ
అది తెలిసే నిను కలిశా
ఓ నిధిలా మెరిసే సొగసా
నను కలిసే ఓ గడుసా
ముందరికే ఉరికే వరస
నేనున్నది నీకోసమె, సందేహమే లేదు
నిను చుసిన నా కంటికి నిదురన్నదే రాదు
అనుకోనిది, అనలేనిది ఒక హాయి ఏదేదో
నిను చూసిన నిమిషాలలో కలిగిందిలే నాలో
నీ చూపుల వేకువలో
నీ నవ్వుల వెన్నెలలో
ఒక వెచ్చదనం
ఒక చల్లదనం
నీ ప్రేమ ధనం దొరికే ఓ ఓ ఓ ఓ
ఓ మైనా ఓ మైనా
ఓ మైనా ఓ మైనా



Credits
Writer(s): Koti, Samavedam
Lyrics powered by www.musixmatch.com

Link