Annantey Dosthey Sodara (From "Sodara")

ఒక కన్ను అమ్మల్లే
ఒక కన్ను నాన్నల్లే
కనిపిస్తే दुनियाలో
తన పేరే అన్నంట
ఒక రక్తం ప్రవహించే
అన్నల్లే ముందొచ్చి
తమ్మునికి కనురెప్పై
ఉంటాడు life అంతా
అన్నంటే దోస్తే సోదరా
Secrets-ye లేవురా
చిన్నోడై పుడితే సోదరా
జన్మంతా జాతర

(అన్నదమ్ములం ఒక్కటాయెనే)
(చూడముచ్చట రామ లక్ష్మణులే)

ఊరంతా సంక్రాంతి ముగ్గేసే మొగ్గల్లో
ఊరించే పరువాలు చూడవా
ఏ భారం లేకుండా
ఎగిరే ఓ గాలిపటం
నీ వెంటే ఆనందం నాదిరా
నువు తిలకం పెట్టుకుంటే
శ్రీరాముడివన్నయ్యా
నువు పట్టు పంచే కడితే
అచ్చంగా కన్నయ్య
ఇలాగ మిమ్మల్ని
చూసేటి జనాల
చూపంతా నీ మీద దిష్టౌతదేమో
అన్నంటే దోస్తే సోదరా
Secrets-ye లేవురా
చిన్నోడై పుడితే సోదరా
జన్మంతా జాతర

(అన్నంటే దోస్తే సోదరా)
(Secrets-ye లేవురా)
(చిన్నోడై పుడితే సోదరా)
(జన్మంతా జాతర)

ఎవరెవరో నా మీద
ఏవేవో చెబుతుంటే
ముద్దు ఈ గోపాల గారడీ
నా వల్ల కాలేని
నీ అల్లరి చూస్తుంటే
గుండెల్లో గోదారి సందడి
నువు రోజూ తిట్టే తిట్లు
గుడి మెట్లు అనుకుంటా
నీ బిగిసిన పిడికిట్లోన
నా ధైర్యం చూస్తుంటా
నా శ్వాసలో ఉన్న
ప్రాణాలు ధైర్యాలు
నీకోసమంటాను ఒట్టేసి నేను
అన్నంటే దోస్తే సోదరా
Secrets-ye లేవురా
ఒక కన్ను అమ్మల్లే
ఒక కన్ను నాన్నల్లే
కనిపిస్తే दुनियाలో
తన పేరే అన్నంట
ఒక రక్తం ప్రవహించే
అన్నల్లే ముందొచ్చి
తమ్మునికి కనురెప్పై
ఉంటాడు life అంతా

అన్నంటే దోస్తే సోదరా
Secrets-ye లేవురా
చిన్నోడై పుడితే సోదరా
జన్మంతా జాతర



Credits
Writer(s): Suddala Ashok Teja, Sunil Kashyap
Lyrics powered by www.musixmatch.com

Link