Nijame Ne Chebutunna

తానానే నానానే నానానేనా
తానానే నానానేనే
తానానే నానానే నానానేనా
తారారే రారారేరే

నిజమే నే చెబుతున్నా जाने जाना
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా
వెళ్లకే వదిలెళ్లకే
నా గుండెని దోచేసిలా
చల్లకే వెదజల్లకే
నా చుట్టు రంగుల్నిలా
తానారే రారారే రారారేనా
తారారే నానారేరే
తానారే నానారే తానారేనా
తారారే రారారేరే

వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే
మౌనం తెలుసే నాకు మాట తెలుసే
మౌనంలో దాగుండే మాటలు తెలుసే
కన్నుల్తో చూసేది కొంచమే
గుండెల్లో లోతే కనిపించెనే
పైపైన రూపాలు కాదులే
లోలోపలి ప్రేమే చూడాలిలే
నిజమే నే చెబుతున్నా जाने जाना
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా

పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా
మనసారా ఓ సైగే చాలంటున్నా
అడుగులతోటి దూరం కొలిచేకన్నా
దూరాన్నే గుర్తించని పయనం కానా
నీడల్లే వస్తానే నీ జతై
నీ తోడల్లే ఉంటానే నీ కథై
ఓ ఇనుప పలకంటి గుండెపై
కవితల్ని రాసావు దేవతై

నిజమే నే చెబుతున్నా जाने जाना
నిన్నే నే ప్రేమిస్తున్నా
నిజమే నే చెబుతున్నా ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా ఆహహా



Credits
Writer(s): Shree Mani, Shekhar Chandhra
Lyrics powered by www.musixmatch.com

Link