Konte Kallu (From "Haddhu Ledhu Raa")

చక్కని అమ్మాయే
చక్కగ నవ్వేస్తూ పిలిచి
మనసే చుక్కల లోకంలో విహరించెనే
టక్కరి చూపుల్తో
టక్కున వలవేస్తూ వలచి
ఊహల పల్లకి ఉయ్యాలే ఊపే

కొంటె కొంటె కళ్లతోనే
మాయ చేసావే
మాట వినదు మనసే
ముద్దు ముద్దు మాటల్తోనే మంత్రమేశావే
ఊపిరంతా ఎగసే
పెదవి దాచే ఊసులే
ఏవో ఊహలై నిన్నే కోరెలే
నీ చిలిపి నవ్వు
చిన్ని గుండెనే దోచేనే

కొంటె కొంటె కళ్లతోనే
మాయ చేసావే
మాట వినదు మనసే
ముద్దు ముద్దు మాటల్తోనే మంత్రమేశావే
ఊపిరంతా ఎగసే

ఓసారి చూడు పిల్లా ఎంత అందగాడే
నీ ప్రేమ కోసం
నీతో వెంటే వస్తున్నాడే
నీ చేయి పట్టుకొని
ఇంక విడిపోడే
నీకే తెలుసా ఇలా ఇలలో

జాబిలే మబ్బంచులో నిద్రించునేమో
నిన్నే చూస్తే సాటేరానని
మంచులో వసంతమే దాగుంటదేమో
అందమంటే నీదేలే అని
పాల పుంత నేడు
చెంత కొచ్చి వాలినా
నిన్ను పోల్చుకుంటున్నా
పాల సంద్రమంత పైటలాగ మారెనా
చూపు తిప్పుకోగలనా
చెయ్యందుకోవే చెంచలా
నువ్వేలే ప్రేమ వెన్నెలా

కొంటె కొంటె కళ్లతోనే
మాయ చేసావే
మాట వినదు మనసే
ముద్దు ముద్దు మాటల్తోనే మంత్రమేశావే
ఊపిరంతా ఎగసే

ఓ గుండెలో వర్ణాలనే చల్లేసినావే
చందనాల వాన జల్లులా
శ్వాసలో సుగంధమై నింపేసినావే
సన్నజాజి పూల కొమ్మలా
భాషలెన్ని ఉన్నా నిన్ను పొగడడానికే
కొత్త భాష వెతికాలే
ఎన్ని జన్మలై నిన్ను పొందడానికే
మళ్లీ మళ్లీ పుడతాలే
నూరేళ్ల బంధమై ఇలా
నన్నల్లుకోవే నువ్విలా

కొంటె కొంటె కళ్లతోనే
మాయ చేసావే
మాట వినదు మనసే
ముద్దు ముద్దు మాటల్తోనే మంత్రమేశావే
ఊపిరంతా ఎగసే
పెదవి దాచే ఊసులే
ఏవో ఊహలై నిన్నే కోరెలే
నీ చిలిపి నవ్వు
చిన్ని గుండెనే దోచేనే



Credits
Writer(s): Kamal Kumar D
Lyrics powered by www.musixmatch.com

Link