Ooginde Ooginde (From "Vey Dharuvey")

నల్లని కళ్లేమో గుండె గిల్లు గులాబి
తెల్లనైనా నవ్వేమో నోరువూరు జిలేబి
ఎంచక్కా నచ్చిందే కత్తిలాంటి చిన్నారి
నన్ను దోచే వయ్యారి
నింగిలోనే సవ్వారి
పాలుగారే చెక్కిళ్లు చూస్తుంటే
ఎక్కిళ్లు నాలో రేగేనే
పిడికిడంత నడుముని తమిడితే
అడుగులు తడబడి ఆడేనే
ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
గుండె ఊయలై ఊగిందే
తేలిందే తేలిందే తేలిందే తేలిందే
ఒళ్లు గాలిలో తేలిందే

ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
గుండె ఊయలై ఊగిందే
తేలిందే తేలిందే తేలిందే తేలిందే
ఒళ్లు గాలిలో తేలిందే

హో పండు వెన్నెల్లో చంద మామల్లే
హాయి చల్లగా చల్లి పోతివే
మండుటెండలో నల్ల మబల్లే
చిరు జల్లు కురిపిస్తివే
సందె ముగ్గుల్లో ముద్ద బంతల్లే
ముద్దు ముద్దుగా మెరిసిపోతివే
పూల జానల్లో తేనె జల్లుల్లో
నను ముంచి మురిపిస్తివే
కంటి రెప్ప వాలదే
చూపు తిప్పనీవులే
కాలమంత కౌగిలై
నీ ఊసుల్ని విన్నాను
ఊగిస్తూ ఉన్నాను

ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
గుండె ఊయలై ఊగిందే
తేలిందే తేలిందే తేలిందే తేలిందే
ఒళ్లు గాలిలో తేలిందే

ఏ చుక్కలున్న ఆ చీర చెంగుల్లో
చిట్టి గుండెనే చుట్టి వేస్తివే
ఊగుతున్న ఆ నడుము వొంపుల్తో
ప్రాణాలు తీసేస్తివే
ఘల్లు ఘల్లు మన్న
ఆ మువ్వ సవ్వడే
జిల్లు జిల్లు మంటూ ఆశ రేపెనే
మెత్త మెత్తగా హత్తుకొమ్మని
ఓ మత్తు కలిగించెనే
అందమైన ఊహాలే ఊసులన్నీ నీవులే
నీకు నేను నీడనై
నే నీతోనే ఉంటాను
నువ్వే నేనంటాను

ఊగిందే ఊగిందే ఊగిందే ఊగిందే
గుండె ఊయలై ఊగిందే
తేలిందే తేలిందే తేలిందే తేలిందే
ఒళ్లు గాలిలో తేలిందే



Credits
Writer(s): Bheems Ceciroleo
Lyrics powered by www.musixmatch.com

Link