Madhuramu Kadha (From "The Family Star")

పించం విప్పిన నెమలికిమల్లే
తొలకరి జల్లుల మేఘమల్లే
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లే
కవితలు అద్దిన పుస్తకమల్లే
సంతోషములో ముద్దుగా ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి
వింతలు ఏడు పక్కకు జరిపి
కొత్తగ పుంతలు తొక్కెను
ఈ అరవిందం
అమ్మమ్మో తాండవ మాడే కృష్ణుడు నుండి
వేణువు గానం తీయగ పండి
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

మధురము కదా ప్రతొక నడక
నీతో కలిసి ఇలా
తరగని కథ మనది గనుక
మనసు మురిసెనిలా
ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా
కసురైన విసురైన విసుగైనా రాదుగా

పించం విప్పిన నెమలికిమల్లే
తొలకరి జల్లుల మేఘమ్మల్లే
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లే
కవితలు అద్దిన పుస్తకమల్లే
సంతోషములో ముద్దుగా ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి
వింతలు ఏడు పక్కకు జరిపి
కొత్తగ పుంతలు తొక్కెను
ఈ అరవిందం
అమ్మమ్మో తాండవ మాడే కృష్ణుడు నుండి
వేణువు గానం తీయగ పండి
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

ఏదో సంగీతమే హృదయమున
ఎంతో సంతోషమే
క్షణములో గాల్లో తేలిన భ్రమే
తిరిగి నవ్వింది ప్రాయమే
ఏదో సవ్వడి విని
టక్కుమని తిరిగానే నువ్వని
మెరుపులా నువ్వొస్తున్నావని
మబ్బులో జారె యద సడి

నీ పేరే పలికినదో
ఏ మగువైన తగువేనా
నీ గాలే తాకినదో
చిరుగాలైన చంపెయ్ నా
హెచ్చరిక చేసినా నీకు నీడైనా
వెన్నెలను నిన్ను వదలమని
వైనం ప్రతి నిమిషమున
హక్కులు ఇవి
నాకు మాత్రం అవి సొంతం
ఇలా నీ పైన
మధురము కదా ప్రతొక నడక
నీతో కలిసి ఇలా
తరగని కథా మనది గనుక
మనసు మురిసెనిలా

పించం విప్పిన నెమలికిమల్లే
తొలకరి జల్లుల మేఘమల్లే
అలజడి హృదయం ఆడిన కూచిపూడి
రంగులు దిద్దిన బొమ్మకుమల్లే
కవితలు అద్దిన పుస్తకమల్లే
సంతోషములో ముద్దుగా ఈ అమ్మాడి
ఆరారు ఋతువుల అందం
ఒకటిగ కలిపి
వింతలు ఏడు పక్కకు జరిపి
కొత్తగ పుంతలు తొక్కెను
ఈ అరవిందం
అమ్మమ్మో తాండవ మాడే కృష్ణుడు నుండి
వేణువు గానం తీయగ పండి
రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం



Credits
Writer(s): Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link