Aakashame Nuvvani

ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నన్నే దాచుకోనా
నువ్వే నేనని
చందమామే నువ్వని
వెన్నెలేమో నేనని
నీతో జతై ఉండిపోనా
నేనే నువ్వనీ
చిరుజల్లే కురిసినా
చిరు చెమటే మనసున
నువ్వో క్షణం దూరం అయితే
ఊపిరి ఆగేనా
హరివిల్లే మెరిసెనా
సిరిమల్లే విరిసెనా
నీతో ఉంటే ఇంతందంగా
లోకం చూస్తున్నా
కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా
కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా

సంద్రమల్లే ఎదురు చూస్తే
నదిలాగా మారనా
చైత్రమల్లే నువ్వు పూస్తే
చిగురాకే అవ్వనా
నన్నే వరించే యువరాజు నువ్వంటా
నీ యువరాణి పదవిస్తే చాలులెమ్మంటా
చెలి కులుకు లొలుకు
పడుచు సొగసు నెమలి నువ్వైతే
నీ చెమకు చెమకు హొయలు
చిలుకు చినుకు నేనౌతా
మనసుకి నీ మీదే మనసైనదిలే
చెరిసగమై మరుజగమే మనమౌదాంలే

తియ్యనైన ఊసులాడు
తెలిమంచే నువ్వులే
వెచ్చనైన ఊహరేపు
తొలి వేకువ నేనులే
ఎన్నో వర్ణాల చిరుగాలి సవ్వల్లే
నువు పిలిచావని తలచావని
కబురు తెచ్చేలే
నువు దివిని వదిలి
భువికి దిగిన దేవకన్యవులే
నువు నడిచి వెలితే
పుడమి ఎదకు పులకరింతేలే
మిలమిల తారై మది మురిసెలే
జిలిబిలిగా చలిగిలులే చెలరేగెలే
ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నన్నే దాచుకోనా
నువ్వే నేనని
చందమామే నువ్వని వెన్నెలేమో నేనని
నీతో జతై ఉండిపోనా
నేనే నువ్వనీ
కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా

కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా



Credits
Writer(s): Achu Rajamani, Rambabu Gosala
Lyrics powered by www.musixmatch.com

Link