Andamanani Premarani

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే
చెమటనీరే మంచి గంధం ఓరచూపే మోక్ష మార్గం
వయసులా సంగీతమే. భూమికే భూపాలమే.
వయసులా సంగీతమే. భూమికే భూపాలమే.

స ని సా స రి గ రి స ని స ని ప ని స ని సా స గ మ మ ప మ గ రి స
స ని సా స రి గ రి స ని స ని ప ని స ని సా స గ మ మ మ ప ప గ రి స

అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలౌనులే
ప్రేమకెపుడు మనసులోన బేధముండదే ఎంగిలైన అమృతమ్ములే
గుండుమల్లి ఒక్క రూపాయి నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయి అర్ధరూపాయి నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపాయలు

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడ ముత్యమేలే
చెమటనీరే మంచి గంధం ఓరచూపే మోక్ష మార్గం
వయసులా సంగీతమే. భూమికే భూపాలమే.
వయసులా సంగీతమే. భూమికే భూపాలమే.

ప్రేమ ఎపుడు ముహూర్తాలు చూసుకోదులే
రాహుకాలం కూడ కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే కాకి చేత కూడ కబురు చాలులే
ప్రేమజ్యోతి ఆరిపోదే ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానే కాదే ఈ సత్యం ఊరికి తెలియలేదే
ఆకసం భూమి మారినా మారులే కానీ ప్రేమ నిత్యమే
ఆదిజంట పాడిన పాటలే ఇంకా వినిపించులే
ప్రేమా. తప్పుమాటని ఎవ్వరైన చెప్పినా నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమ ముళ్ళబాట కాదు వెళ్ళవచ్చు అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా



Credits
Writer(s): A.r. Rahman, Rajasri
Lyrics powered by www.musixmatch.com

Link