Mounamelanoyi

మౌనమేలనోయి... మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
యదలో వెన్నెల వెలిగే కన్నుల
యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలా
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
పలికే పెదవి వణికింది ఎందుకో
వణికే పెదవి వెనకాల ఏవిటో
కలిసే మనసులా విరిసే వయసులా (2)
నీలి నీలి ఊసులు లేత గాలి బాసలు
ఏమేమో అడిగినా.మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా వలపు మడుగులా (2)
కన్నె ఈడు ఉలుకులు కంటి పాప కబురులు
ఎంతెంతొ తెలిసినా.మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి
యదలో వెన్నెల వెలిగే కన్నుల
యదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో
ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రేయి



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Ilaiya Raaja
Lyrics powered by www.musixmatch.com

Link