Kalai Poyenu

ప్రేమలే నేరమా ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో...

కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ
మదికే అతిధిగ రానేలనో శెలవైనా అడగక పోనేలనో
ఎదురు చూపుకు నిదరేదీ ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన మనిషెక్కడో నా పిలుపే అందని దూరాలలో...
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ

అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది
అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది
ఎవరికివారే ఎదురుపడి ఎదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనీ శిలనైతిని
ఎండమావిలో నావను నే ఈ నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ

వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి
వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి
చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగ మిగులుననీ
నీకై వెతికా కౌగిలినై నీడగ మారిన వలపులతో
అలిసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ
కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, A Rahman
Lyrics powered by www.musixmatch.com

Link