Lussia

లుసియా

ఆకాశం నీరు నిప్పు నేల ఈ గాలి
నా కోసం చెప్పిందల్లా చేస్తూ ఉండాలి
ఆకాశం నీరు నిప్పు నేల ఈ గాలి
నా ముందు చేతులు కట్టి దండం పెట్టాలి
చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే లుసియా

నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా
గాలిలా నిండుతా జ్వాలనై మంట రేపుతా
నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా
పంచభూతాలను నాలో చూపుతా చూపుతా
చల్ చల్ గడియారం ఉన్నది చూడు నా చేతుల్లో
చల్ చల్ నా టైము నేనే నడిపిస్తా
చల్ చల్ పుస్తకము పెన్నూ ఉంది నా గుప్పెట్లో
చల్ చల్ నా చరిత నేనే రాసేస్తా లుసియా

రాజుని బంటుని రెంటినీ నేనేనంట
యుద్ధము, శాంతము మద్యలో నేనేనంట
పయనము, గమ్యము మొత్తము నేనేనంట
నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా
చల్ చల్ నా ముందు నా వెనకాల నేనే ఉంటా
చల్ చల్ నా పోటీ నేనే వస్తుంటా
చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట
చల్ చల్ నా దిష్టి నేనే తీస్తుంటా లుసియా

ఆకాశం నీరు నిప్పు నేల ఈ గాలి
నా కోసం చెప్పిందల్లా చేస్తూ ఉండాలి
ఆకాశం నీరు నిప్పు నేల ఈ గాలి
నా ముందు చేతులు కట్టి దండం పెట్టాలి
చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే లుసియా



Credits
Writer(s): Chandrabose, Ramana Gogula
Lyrics powered by www.musixmatch.com

Link