Kallallo Pelli Pandhiri

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే

నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో

పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే

సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి

మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే
జీవితాన పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే

వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే
భావియే నందన వనమైతే
జీవితాన
పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
అహ అ అహహ అహ అ అహహ
అహ అ అహహ అహ అ అహహ

Credits
Writer(s): Sri Sri, S Rajeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link