Raakkaasi

రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువు రేకుల్లా ఉన్నాయి అంటా నేనే
సరి కొత్త కొత్త సంగ్రామమ్ చూడు
ప్రతి ఒక్క దిక్కు గతి తప్పే నేడు
ఓ కుసుమం కోసం అయిదారు కొండలు ఎక్కేస్తా
నా హృదయం నిండా నిండావే నువ్వు
ఓ కోయిల కోసం ఏడేడు కోనలు గాలిస్తా
నా ప్రాణం లోని తీపంటే నువ్వే హో
రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువు రేకుల్లా ఉన్నాయి అంటా నేనే

అడుగుల పిడుగులకే నేలంత పొడి అగును
అమ్మడి పేరు చెబితే నీరంతా పడవగునే
నా కన్నుల పాపలు కాలు మోపే చోట చీకటి చెదురునులే
ఈ అడవిని ఒంటరిగ మారిన నీ ఆశలొ జంటై నేను సాగనా
నే శిశిరంలోన చిగురిస్తాలే మరణం లోన మరలొస్తాలే
రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువు రేకుల్లా ఉన్నాయి అంటా నేనే

మృగములు కనిపిస్తే చెయ్యెత్తి అణిచేస్తా
విషములు కుమరిస్తే కన్నెత్తి ఆపేస్తా
నా వెనుకన విధి చెడు నీడ పడితే ఎముకలు విరిచేస్తా
ఈ మార్గంలోన మేఘం లాగా మారిన
తిరుగు పయనంలోనా పవనంలాగా సాగనా
ఓ ఉరుమ మెరుప చినుక తనకై వస్తున్నానని కబురివ్వండే
రాకాసి రాకాసి దారుల్లోనే
ఇక నీకేసి నీకేసి వస్తున్నానే
దూకేసి దూకేసి నిప్పుల్లోనే
పువు రేకుల్లా ఉన్నాయి అంటా నేనే
సరి కొత్త కొత్త సంగ్రామమ్ చూడు ప్రతి ఒక్క దిక్కు గతి తప్పే నేడు



Credits
Writer(s): Chandrabose, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link