Aduthu Paaduthu

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది

ఒంపులు తిరిగి వయ్యారంగా ఊపుతు విసరుతు గుడేస్తుంటే
ఒంపులు తిరిగి వయ్యారంగా ఊపుతు విసరుతు గుడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటే నా మనసు ఝల్లుమంటున్నదీ
నా మనసు ఝల్లుమంటున్నదీ

ఆడు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది

తీరని కోరికలూరింపంగా ఓరకంట నను చూస్తూ ఉంటే
తీరని కోరికలూరింపంగా ఓరకంట నను చూస్తూ ఉంటే
చిలిపి నవ్వులు చిందులు తొక్కి
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నదీ
నును సిగ్గు ముంచుకొస్తున్నదీ

ఆడతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది

చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తు ఉంటే
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తు ఉంటే
తియ్యని తలపులు నాలో ఏమో
తియ్యని తలపులు నాలో ఏమో
తికమక చేస్తూ ఉన్నవి
అహ తిక మక చేస్తూ ఉన్నవి

ఆడుపాడుతు పని చేస్తుంటే అలుపుసొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది

మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
పాట పాడుతుంటే నామది పరవశమైపోతున్నదీ
పరవశమైపోతున్నదీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆడతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది

Credits
Writer(s): Master Venu, Kosaraju
Lyrics powered by www.musixmatch.com

Link