Ee Pagalu Reyiga

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ

ఊఁ

వింతకాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి
ఓ ఓ ఓ

మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
అహా ఓహో అహా ఆ ఆ
మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు
పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు
ఊఁ
వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి
ఆ ఆ ఆ ఆ
ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఆ
ఊ ఊూ ఊూ

కన్నులు తెలిపే కథలనెందుకు. రెప్పలార్చి ఏమార్చేవు
ఆఁ ఆఁ ఓ ఓ ఓ
కన్నులు తెలిపే కథలనెందుకు. రెప్పలార్చి ఏమార్చేవు
చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు
ఓహోహో
వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి

అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
ఉహుహు
అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను
ఆహా
వెండివెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి
ఆహహాహా ఆహహాహా ఆహహాహా ఆహహాహా
ఊహుహూ

Credits
Writer(s): Athreya, Master Venu
Lyrics powered by www.musixmatch.com

Link