Ee Reyi Theeyanidhi Chitti Chellelu

ఈ రేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది
ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా, ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

ఆ ఆ ఆ... ఆ ఆ... ఆ ఆ ఆ...
పరువాలు పల్లవి పాడగా, నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా, నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగా నును-మేని-తీగ
పులకించిపోయెను తొలకరి వలపుల

ఈ రేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది

ఎన్నెన్ని జన్మల బంధమో, ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో, ఏ పూల నోముల పుణ్యమో
నిన్ను నన్ను కలిపే, నీ నీడ నిలిపే
అనురాగ-సీమల అంచులు దరికే

ఈ రేయి తియ్యనిది, ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది



Credits
Writer(s): S Rajeshwara Rao
Lyrics powered by www.musixmatch.com

Link