Kanulu Kanulu

కనులు కనులు కలిసెను

కన్నె వయసు పిలిచెను

కనులు కనులు కలిసెను
కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను
అసలు మనసు తెలిసెను

ముఖము పైన ముసురుకున్న ముంగురులె అందము

ముఖము పైన ముసురుకున్న ముంగురులె అందము
సిగ్గు చేత ఎర్రబడిన బుగ్గలదే అందము
కోరిన చిన్న దాని కోర చూపె అందము
కోర చూపె అందము
కనులు కనులు కలిసెను
కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను
అసలు మనసు తెలిసెను

దొండ పండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు

దొండ పండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు
ముచ్చటైన పైట కొంగు ముడులు వేయటెందుకు
పోవాలనుకొన్నా పోలేవు ముందుకు
పోలేవు ముందుకు
కనులు కనులు కలిసెను
కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను
అసలు మనసు తెలిసెను

నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును

నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును
కసురుతున్న మనసులోనె మిసిమి వలపులూరును
కలిగిన కోపమంత కౌగిలిలో తీరును
కౌగిలిలో తీరును
కనులు కనులు కలిసెను
కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే అసలు మనసు తెలిసెను
అసలు మనసు తెలిసెను



Credits
Writer(s): Master Venu, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link