Noraara Pilichina

నోరార పిలిచినా పలకని వాడినా
మనసున మమతలున్న మనిషిని కానా

నోరార పిలిచినా పలకని వాడినా
మనసున మమతలున్న మనిషిని కానా
ఓ ఓ ఓ ఓ
నేల మీద మనలాగే ప్రాణులెన్ని ఉన్నా
పిలిచేందుకు పలికేందుకు
చుట్టరికాలతొ చుట్టుకునేందుకు
ఎన్నెనో అందమైన వరసలు మనవేలే కన్నా
నోరార పిలిచినా పలకని వాడినా
మనసున మమతలున్న మనిషిని కానా

ఎవ్వరికీ ఏమీ కానీ ఏకాకినై ఉన్న
నా పేరు ఇన్నాళ్ళు ఒంటరి సున్నా
అంకుల్ అంట నాకు దగ్గరయ్యే చిన్ని అంకెలాంటి లేత బంధం
అల్లుడంటు నన్ను అల్లుకుంది పూల సంకెళంటి అనుభందం
బావనయ్యాను మరిదినయ్యాను
మావయ్యనయ్యాను
మనవడ్ని అయ్యాను
ఎంతమంది చెంతకొచ్చారో
ఎన్ని పేర్ల కొత్త జన్మనిచ్చారో
ఓ ఓ ఓ ఓ
తీరి పోనీ రుణమందుకున్న
ఇంతకన్న ధనముండదన్న
మునుపెరుగని అనుభవమని మైమరపున ఉన్నా
నోరార పిలిచినా పలకని వాడినా
మనసున మమతలున్న మనిషిని కానా

పదుగురు పంచుకోని ఆనందమేదైనా
పచ్చికైన పెంచలేని ఎడారి వాన
ఆడమగ జంట ఆలుమగలుగ మారి అంతె చాలు అంటారా
అమ్మానాన్నలుగ అత్తామామలుగ పేరు పొందాలనుకోరా
తాతయ్యలవ్వాలి మీసాలు దువ్వాలి
అవ్వనే నవ్వాలి గవ్వలా నవ్వాలి
అనే ఆశ తోడు ఉండగా
పైనబడే ఈడు కూడ పండుగ
ఓ ఓ ఓ ఓ
అయిన వాళ్ళు ఉన్న లోగిళ్ళలో
ఆయువాగిపోదు నూరేళ్ళతో
తరతరమున తరగని కథ చెబుతుంది ర చిన్నా
నోరార పిలిచినా పలకని వాడినా
మనసున మమతలున్న మనిషిని కానా
నోరార పిలిచినా పలకని వాడినా
మనసున మమతలున్న మనిషిని కానా



Credits
Writer(s): M.m Keeravani, Sirivennela Seetharamashastry
Lyrics powered by www.musixmatch.com

Link