Kotta Bangaru Lokam

కొత్త బంగారులోకం
మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం
పుడమికావాలి స్వర్గం

కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

జంట నేలవంకలుండే నింగి కావాలి మాకు
వెండి వెన్నెల్లలోనె వెయ్యి కలలు పండాలి మాకు
పువ్వులే నోరు తెరిచి మధుర రాగాలు నేర్చి పాటలే పాడుకోవాలి
అది చూసి నే పొంగిపోవాలి
మనసనే ఒక సంపదా ప్రతి మనిషిలోనూ ఉండనీ
మమతలే ప్రతి మనసులో కొలువుండనీ
మనుగడే ఒక పండగై కొనసాగనీ
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం

ఓడిపోవాలి స్వార్ధం ఇల మరచిపోవాలి యుద్ధం
మరణమే లేని మానవులె ఈ మహిని నిలవాలి కలకాలం
ఆకలే సమసిపోనీ అమృతం పొంగిపోనీ
శాంతి శాంతి అను సంగీతం ఇంటింట పాడనీ ప్రతి నిత్యం
భేదమే ఇక తొలగనీ వేడుకే ఒక వెలగనీ
ఎల్లల పోరాటమే ఇక తీరనీ
ఎల్లరూ సుఖశాంతితో ఇక బతకనీ
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం
కొత్త బంగారులోకం మాకు కావాలి సొంతం
గాలి పాడాలి గీతం పుడమి కావాలి స్వర్గం



Credits
Writer(s): A R Rahman, Rajashri
Lyrics powered by www.musixmatch.com

Link