Ie Kshanamaina

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం
Telephone చిలుకా అడిగా నీ దర్శనం
మాటతోనే ఆటలాడే నాటకమే
చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే
పాడితే ప్రతి పలుకులో స్వరం నీది కదా
వెతికితే కనిపించవా ఇది వింత కథ

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం
Telephone చిలుకా అడిగా నీ దర్శనం

సుగంధాలు జల్లే పువ్వా ఎక్కడుంది నీ చిరునామా
గాలిలాగా గాలిస్తూ నే తిరిగానే, నే తిరిగానే
నిన్ను కోరి పాడి పాడి కళ్ళు తెరిచి చూసి చూసి
కానరాక కన్నీళ్ళల్లో మునిగానే, నే మునిగానే
ఎందుకో మనసెందుకో నీ ఊహలలో కరిగే
రేగినా సుడిగాలిలా అన్వేషణలో తిరిగే
పాటలోన పరవశించే నీ పలుకే
ఉన్న ప్రాణం పోకముందే రావె చెలీ

మాటతోనే ఆటలాడే నాటకమే
చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం
Telephone చిలుకా అడిగా నీ దర్శనం

ఒక్కసారి కంటి నిండా నిన్ను చూసుకున్న చాలు
చూపు దీపమారిపోని అటుపైనే నా ప్రియ రాణి
నిన్ను చూడలేని వేళ చావు నన్ను చేరుకున్నా
కళ్ళు రెండు మూతలు పడవే ఏమైనా కాసేపైనా
నాదని ఇకలేదని నా బ్రతుకే నీదనీ
తెలుసుకో నను కలుసుకో నీ మనసును మార్చుకొని
ప్రేమ శాపం అందచేసే దేవతవే
కలలలోనే కదలి సాగే ప్రేయసివే

మాటతోనే ఆటలాడే నాటకమే
చాలునమ్మా చెంతకు రావే ఈ క్షణమే

ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం
Telephone చిలుకా అడిగా నీ దర్శనం



Credits
Writer(s): Deva, Bhuvanchandra
Lyrics powered by www.musixmatch.com

Link