Sri Karam

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన

శ్రీకారం చుడుతున్నట్టూ
కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నా
ఏ మాక్కుడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టూ
రాబోయో పండుగ చుట్టూ
నీ గుప్పిట ఎదో గుట్టు
దాక్కుందే బంగరు బొమ్మా

శ్రీకారం చుడుతున్నట్టూ
కమ్మని కలన ఆహ్వానిస్తూ
నీ కనులేటు చూస్తున్నా
ఏ మాక్కుడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టూ
రాబోయో పండుగ చుట్టూ
నీ గుప్పిట ఎదో గుట్టు
దాక్కుందే బంగరు బొమ్మా

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన

జల జల జల జాజుల వాన
కిల కిల కిల కిన్నెర వీణా
మిల మిల మిన్నంచుల పైనా
మెలి తిరిగిన చెంచలయానా
మదురోహల లాహిరిలోనా
మదిలూపే మదిరవే జానా
నీ నడకలు నీవేనా
చూసావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద
పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తయినా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపుని ముల్లై గుచ్చే
కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు
లావన్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు
గాలికి గజలైపోతారు
నీవేలే తాకిన వారు
నిలువెల్లా వీణవుతారు
కవితవో యవతివో ఎవతివో ఒప్పించేదేట్టగమ్మా

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన

నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టూ
నీ మనసుకు రెక్కలు కట్టు
చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ
ఎప్పుడూ ఎదురోస్తుదంటూ
చిక్కటి చీకటినే చూస్తూ
నిద్దురనే వెలివేయ్యద్దు
వేకువనే లాక్కోచ్చేట్టు
వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయ్యేట్టు
అందాకా మారం మాని
జో కోట్టవే ఆరటాన్ని
పొందిక్క పొడుకో రాణి
జాగారం ఎందుకుగాని
నలినివో హరిణివో తరుణివో
మురిపించే ముద్దుల గుమ్మా

తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన తోం తనన
తోం తనన తోం తనన



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Yogeshwara Sharma
Lyrics powered by www.musixmatch.com

Link