Bolo Krishna

సాహిత్యం: వేటూరి

తక్క దిన్న తక్కా దిన్న (2)
తకా తక్కా దిన్న (2)

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద
వెన్నెలలా తేలించరా
ఒక బేబీ భామ పోరాటం
ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిరో
అది చుక్కల గాలికి మొక్కిన చక్కని జాబిల్లిరో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద
వెన్నెలలా తేలించరా

వెన్నెట్లో నేను వేడెక్కితే ముద్దు తేనెల్లో నన్ను ముంచెత్తరా
చిగ్గంటు లేక చలరేగితే ఉగ్గు పాలిచ్చి జోల పాడేయన
పొద్దు పోదోయ్ నాకు హద్దులేదోయ్ నీకు
ఆడదే అరిటాకు ముళ్ళు నే కానీకు
పడగెత్తిన పరువానికి అలవాటు
తొడగొట్టిన మహవీరుడి తొలిపాటు
ఇక చూడు మరి చూపు మరి పిల్ల కిదే ఫిబ్రవరి
చలి గిలి భళా భళిరో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద
వెన్నెలలా తేలించరా

నీ వేణు గానం విన్నప్పుడే నే రాధల్లె ఊగి పోయానులే
నీ ముగ ప్రేమ కన్నప్పుడే పారిజాతాబిషేకం చేశానులే
కన్నె వయసోయ్ నాది తేనే మనసోయ్ నీది
అందమే తాంబూలం పండని నాకోసం
విసుగెత్తిన విరహానికి విడిచేసి మారుమల్లెకు మరుజన్మకు వదిలేసి
ఇదే సత్యమని స్వప్నమని బంధమని పాశమని రచించని కధాకలిలో

బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద
వేణువిలా వాయించారా
ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద
వెన్నెలలా తేలించరా
ఒక బేబీ భామ పోరాటం
ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి తిక్కల లవ్ బుల్లిరో
అది చుక్కల గాలికి మొక్కిన చక్కని జాబిల్లిరో



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link