Deewana Dil Kho Gaya

కనుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే.
నా ఆశ నీ స్నేహమే, నా శ్వాస నీ కోసమే.
ఆ ఊసుని తెలిపేందుకు, నా భాష ఈ మౌనమే.
కనుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే.
నా ఆశ నీ స్నేహమే, నా శ్వాస నీ కోసమే.

మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి,
నీ చూపునాపేదెలా.
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న,
నా మనసు తేలేదెలా.
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం.
కనుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానము.
నా ఆశ నీ స్నేహమే, నా శ్వాస నీ కోసమే.

అదిరేటి పెదవులని బతిమాలుకుంటున్న,
మదిలోని మాటేదని.
తలవొంచుకొని నేను తెగ ఎదురు చూసాను,
నీ తెగువ చూడాలని.
చూస్తూనే రేయంత తెలవారిపోతుంటే ఏమో ఎలా ఆపడం.

కనుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే.
నా ఆశ నీ స్నేహమే, నా శ్వాస నీ కోసమే.
ఆ ఊసుని తెలిపేందుకు, నా భాష ఈ మౌనమ్.
కనుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే.
నా ఆశ నీ స్నేహమే, నా శ్వాస నీ కోసమే.



Credits
Writer(s): Sandeep Chowta, Dev Kohli
Lyrics powered by www.musixmatch.com

Link