Andala Srimathiki

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఏలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు
నీ నవ్వే తేనే జల్లులే
మీరుంటే స్వర్గమేనులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

చిరుగాలికి పాపం ఏదో సందేహం
మనవెంటే ఉంటూ మన కబుర్లు వింటుంది
ఏంటో ఈ కాలం నిలబడదే నిమషం
నీవెళ్లి రానా అని పరుగులు తీస్తోంది
వినలేదా మల్లెలు కోసం పలికే ఆ తుమ్మెద రాగం
వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇపుడే కొంచం
అదే సుమా నీకు నాకు వేసెను తియ్యని బంధం
ఆ కథలే మరిచిపోనులే
ఊరించే జ్ఞాపకాలులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

పొద్దెరగని ప్రణయం కోరింది హృదయం
నీ లేత పెదవే ఉసికొలిపే ఈ సమయం
హద్దెరగని సరసం తగదన్నది ప్రాయం
శృతి మించిపోతే రుచిలేనిది శృంగారం
విరజాజుల పరుగులకైనా కరునిస్తావని అనుకున్నా
అలకన్నది క్షణమే అయినా మురిపిస్తే వశమై పోనా
వేల వేల చుక్కల్లోన జాబిల్లివి నువ్వేనమ్మా
జాబిలికే వెలుగు సూర్యుడే
నువు లేని బ్రతుకు శూన్యమే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు



Credits
Writer(s): S.a.raj Kumar, E.s. Murthy
Lyrics powered by www.musixmatch.com

Link