Vennelintha

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా
నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయి నువ్వే చూడగా
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా

నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే
నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే
తీయంగా తీవ్రంగా ఏదో ఏదో అవ్వంగ ప్రేమంటూ కానే కాదంట
మేత్తంగా కొత్తంగ ప్రేమను మించే పదమింకా మన జంట కనిపెట్టాలట

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా

గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగింది
నెలైన నిను తడితే ఎదలో అసూయ పెరిగింది
గాఢంగా గర్వంగా జొడి మనమే కట్టంగా ఏడే జన్మలు సరిపోవంట
దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు సృష్టించాలంట

వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తీయగా, బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పవే ఓ ప్రియా

Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link