Anukoledenadu

అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని
కనిపించే ఈ సత్యం స్వప్నమే అనుకోనా
నిజమంటే ఎవరైనా నమ్మనే లేకున్నా
అందరిలో ఇన్నాళ్ళు శిలనై ఉన్నా
నడిసంద్రంలో ఈనాడే అలనయ్యానా

ఓ. అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని

నీలి నింగిలో తేలుతున్న కొంటె వానవిల్లే
నా నవ్వులో జారినా రంగులేరుకోదా
నీటి పొంగులో తుళ్లుతున్న చిట్టి చేప పిల్లే
నా వేగమే ఇమ్మనీ నన్ను కోరుకోదా
రేగే నా ఊహల్ని ఊరేగనీ సాగే ఆ గువ్వల్ని ఓడించగా
నా సైగకు తలవంచి ఆ మేఘమే చినుకల్లే నా ముందే వాలిందిగా
ఒదిగున్న చిన్ని మనసే
తొలి నడక నేర్చుకుందా
ఇక ఉన్న చోటనే ఉంటుందా

అనుకోలేదేనాడు ఈ లోకం నాకోసం అందంగా ముస్తాబై ఉంటుందని
ఈ క్షణమే చూస్తున్నా ఊరేగే వేడుకలు ఊరించే ఎన్నెన్నో వర్ణాలని

నిన్న లేని ఓ స్నేహమేదో నీడలాగ మారి
నా తోడుగా చేరుతూ నన్ను వీడనందా
ఉన్నపాటుగా ఈ ప్రయాణం సాగుతున్న దారి
ప్రతి మలుపులో వింతలే నాకు చూపుతుందా
ఈ కలలే తీరేనా ఇన్నాళ్లకీ సాయంగా మారిందా ఆ స్నేహమే
గుండెల్లో దాగున్న నా పాటకి రాగాలే నేర్పిందా ఈ బంధమే
ఈ ఆశ జారిపోనీ
తీరాన్ని చేరుకోనీ
నూరేళ్ల జీవితం నాదవనీ



Credits
Writer(s): Yuvan Shankar Raja, Vanamaali
Lyrics powered by www.musixmatch.com

Link