Kotaloni Rani

కోటలోని రాణి పేట పోరగాణ్ణి
పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా
గాలి కూడా రాని
గల్లీలోనే కాపురముంటానంటావా
పేదల బస్తీలోనే నీ గూడు కడతావా
ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణి
ఎందుకో ఏమో ప్రేమనే
అడిగి తెలుసుకోవచ్చుగా

కోటలోని రాణి పేట పోరగాణ్ణి
పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా

హొయ్ హొయ్ హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్ హొయ్

ఎపుడూ నీ పైన పడదే చినుకైనా
గొడుగై ఉంటాగా నేనే నీతో
ఇక పై ఎవరైనా వెతకాలనుకున్నా
కొలువై ఉంటాలే నేనే నీలో
నూరేళ్ల పాటు నేనే నీ చుట్టూ
కంచై కాపాడనా
Doctor-u కాడు engineer-u కాడు
ఊరు పేరు లేనోడు
ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు
మొండి సచ్చినోడు కొండముచ్చుగాడు
నిన్నెట్టా సుఖపెడతాడు
భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు
ఇష్టమైనాడే ఈశ్వరుడు
మనసు పడినాడే మాధవుడు
ప్రేమ కుట్టాక పిచ్చి పట్టాక
ఆశ ఆగదు కదా

నగలే కావాలా వగలే వెలిగేలా
ఒక్కో ముద్దు తాకే వేళ
సిరులే ఈ వేళ మెడలో వరమాల
మహరాజంటేనే నే కాదా
ఏదో సంతోషం ఏదో ఉత్సాహం
వేరే జన్మే ఇలా
సత్తు గిన్నెలోని సద్ది బువ్వతోనే
సద్దుకుపోగలనంటావా
అపుడపుడు పస్తుంటూ అలవాటు పడగలవా
ఉప్పు ఎక్కువైనా గొడ్డు కారమైనా
ఆహా ఓహో అనగలవా
ఉక్కిరి బిక్కిరి అవుతూ
ఈ కూడు తినగలవా
పంచదారంటి మమకారం పంచిపెడుతుంటే సంసారం
పచ్చిమిరపైన పాయసం కన్నా
తీయగా ఉండదా

లలలలలాల లలలలలాల లలలలలాల లాలాల
లాలలలాల లాలాల లాలాల



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link