Nee Kanti Choopullo

నీ కంటిచూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేశావే
నీ వెండివెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేశావే
సమయమే ఇక తెలియనంతగ మనసునటు ఇటు కమ్మేశావే
పలుయుగాలకు తనివితీరని కలల తలుపులు తెరిచినావే

నీ కంటిచూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేశావే
నీ వెండివెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేశావే oh

చూసేకొద్దీ చూడాలంటూ
చూపు నీవైపు పోనీకుండా పట్టేశావే
ఇచ్చేకొద్దీ ఇవ్వాలంటూ
నాకై నేనే నువ్వైపోయేలా చుట్టేశావే

ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా
ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా
ఊపిరిలో చిరునవ్వల్లె నీకోసం నేనే ఉన్నా
నా ప్రేమదేశం నీకు రాసిచ్చుకున్నా

నీ కంటిచూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేశావే
నీ వెండివెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేశావే oh

ఏదో ఉంది ఎంతో ఉంది
సూటిబాణాలు గుప్పించేటి నీ రూపులో
నాదేముంది అంతా నీది
మెరుగు పెట్టావే అందాన్నిల్లా నీ చూపుతో

చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో
గూడు కట్టినావే గుప్పెడంత ఆశలో
తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలైపోనీ
నీ జన్మహక్కైపోనీ నా రోజులన్నీ

నీ కంటిచూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏం మాయ చేశావే
నీ వెండివెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేశావే



Credits
Writer(s): Devi Sri Prasad, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link