Jakitlo Jabilli

చుక్కల్లో తళుకులా
దిక్కుల చలి వెలుగులా
పొద్దుల్లో ఎరుపులా
మబ్బుల తొలి మెరుపులా
నింగినించి తొంగి చూసి నచ్చగానే నిచ్చానేసి జర్రుమంటు జారింది
Jacketలో జాబిల్లి
Jacketలో నా మల్లి
Jacketలో జాబిల్లి

చుకల్లో తళుకులా
దిక్కుల చలి వెలుగులా

మల్లెపూల చెల్లెలా
నవ్వుపూల జల్లులా
మిల మిలా సోకులే మీటనివ్వు నన్ను లేతగా
కొంగు చాటు ముంతలా
పొంగు పాల పుంతలా
గిల గిలా గిల్లనా రేతి రేతి రెండు చింతలా
నిబ్బరాల నిమ్మపండు వలిచిపెట్టవా
కొబ్బరంటి కొత్త ఈడు కొలిచిపెట్టవా
ఏకాదశి నా ఊర్వశి
శ్రీ రమ్య శృంగార రాశి
త్రయోదశి జాబిల్లికి
ఈనాడే పున్నమి
సిగ్గమ్మ చీ చీ చి

చుకల్లో తళుకులా
దిక్కుల చలి వెలుగులా
పొద్దుల్లో ఎరుపులా
మబ్బుల తొలి మెరుపులా

నింగి నేల ఒడ్డునా
చందమామ బొడ్డునా
తళ తళా తారలే తాకిపోయే నన్ను మెత్తగా
రాజహంస రెక్కలా
రాసలీల పక్కలా
గుస గుస గువ్వలా గూడు కట్టుకోవే మత్తుగా
పిక్కటిల్లి పోతె ఈడు పైట నిలిచునా
పిక్క లావు పిల్లాదాని నడుము పలచనా
మహాశయా నా మన్మధా
మందార సందెల్లో రా రా
సఖీ ప్రియా సాగే లయా
నా ప్రేమ తొందరా
Jacketలో చిందేసి

చుకల్లో తళుకులా
దిక్కుల చలి వెలుగులా
పొద్దుల్లో ఎరుపులా
మబ్బుల తొలి మెరుపులా
నింగి నుంచి తొంగి చూసి నచ్చగానే నిచ్చానేసి జర్రుమంటు జారింది

Jacketలో జాబిల్లి
Jacketలో నా మల్లి
Jacketలో జాబిల్లి



Credits
Writer(s): Veturi, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link