Brahm Kadigina Padamu

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము
బ్రహ్మ కడిగిన పాదము

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలగక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము

కామిని పాపము గడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రి సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
బ్రహ్మ కడిగిన పాదము

పరమ యోగులకు పరి పరి విధముల
వరమోసగెడి నీ పాదము
తిరు వెంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానానే పాదము



Credits
Writer(s): M.m. Keeravaani, Annamayya
Lyrics powered by www.musixmatch.com

Link