Manishey Maareraa

చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: జానకి, బాలు

ఆ.ఆ.ఆ.ఆ.ఆ.ఆ... రాజా...
మనిషే మారేరా... రాజా మనసే మారేరా
మనిషే మారేరా... రాజా మనసే మారేరా

మనసులో... నా మనసులో... సరికొత్త మమతలూరేరా
మనిషే మారేనా... రాజా... మనసే మారేరా...

రాజా. ఆ. ఆ... ఆ.
ఏ చోట దాగెనో ఇన్నాళ్ళు ఈ సొగసు
ఏ చోట దాగెనో ఇన్నాళ్ళు ఈ సొగసు

ఆ తోట పువులేనా అలనాట లతలేనా

మనిషే మారేరా రాజా... మనసే మారేరా

ఆ... ఆ... ఆ.
ప్రతి పొదలో ప్రతి లతలో... పచ్చనాకుల గూడేరా
ప్రతి పొదలో ప్రతి లతలో... పచ్చనాకుల గూడేరా
గూట గూట దాగుండి... కొత్త గువ్వా పాడేరా

మనిషే మారేనా రాజా... మనసే మారేరా

ఆ... ఆ... ఆ.
అడుగడుగునా జగమంతా అనురాగపు కనులకు
కులుకుతూ కొత్త పెళ్లి కూతురిలా తోచెనే
కులుకుతూ కొత్త పెళ్లి కూతురిలా తోచెనే
ఆనాటివె పువులైన... అలనాటి లతలైన

మనిషే మారెనే .రాణి... మనసే మారెనే
ఆ... ఆ... ఆ... ఆ... అ.ఆ.ఆ... ఆ... ఆ... ఆ... అ.ఆ.
ఆ... ఆ... ఆ... ఆ... అ.ఆ.ఆ... ఆ... ఆ... ఆ... అ.ఆ.



Credits
Writer(s): B. Gopalam, Devulapalli Krishna Sastry, S Rajeshwara Rao
Lyrics powered by www.musixmatch.com

Link