Janavule Nerajanavule

నెరజాణవులే, వరవీణవులే, గిలిగించితాలలో ఆహాహహా
జాణవులే, మృదుపాణివిలే, మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
జాణవులే, వరవీణవులే, గిలిగించితాలలో ఆహాహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

మోమటు దోచి మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి ఒంపులలో హంపికలా ఊగే ఉయ్యాల
చెలి పయ్యదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మరియాదకు విరి పానుపు సవరించవేమిరా

జాణవులే, వరవీణవులే, గిలిగించితాలలో ఆహాహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే, వరవీణవులే, గిలిగించితాలలో ఆహాహహా
నెరజాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం ఈ చలిలో
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి పగవానికి ఒక న్యాయమింక సాగునా

జాణవులే, వరవీణవులే, గిలిగించితాలలో ఆహాహహా

జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో

కన్నులలో సరసపు వెన్నెలలే

సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో

జాణవులే అహ్హహ్హా, వరవీణవులే, గిలిగించితాలలో ఆహాహహా
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link