Kovello Depam La

అరె అరే తొందరగా పాడరా బాబు
అవతల cigarette song-a చూసే song-a అని
Audience అంతా wait చేస్తున్నారు
తొందరగా పాడు, come on sing

కోవెల్లో
దీపంలా
కావ్యంలో
భావంలా
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నా యదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో
దీపంలా
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా

బాగానే ఉందికాని ఇంతకి నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా?
ఉహూ
మరి ఆ అమ్మాయి no అంటే ఏమి చేస్తావ్
దేవదాసునైపోతా
నీకు మందు అలవాటు లేదుకదరా
చేసుకుంటా తాగుతుంటా
ఆ scene తరువాత
ముందు ఆ పిల్ల ఊరు పేరు చెప్పు

సౌందర్యం, అమ్మడి ఊరు
లావణ్యం, ఆ చెలి పేరు
కూర్చోని ఉంటే చూసే గుండెలు ఊగాలి
తను కదిలిందంటే సాగే కాలం ఆగాలి
ఆ నవ్వుకు నేనే దాసోహం
ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం

ఓ కోవెల్లో
దీపంలా
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా

ఆహా ఓహో ఏంటిరా మనోడు super గా చెప్తున్నాడురా
నువ్వుండవోయ్ అరే తొందరగా చెప్పరాబాబు

ఊహల్లో, ఊర్వశులైనా
ఊరించే మేనకలైనా
ఆ చిన్నారిని చూశారంటే చినబోరా
తన చెలికత్తెలుగా ఉంటే చాలని అనుకోరా
ఏ కలలో లేదే ఆ అందం
తను కనిపిస్తేనే కళ్ళకు అర్ధం

ఓ కోవెల్లో
దీపంలా
కావ్యంలో
భావంలా
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నా యదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో
దీపంలా
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా



Credits
Writer(s): Sirpi, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link