Emantaro

ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

చూసే పెదవిని మాటాడే కనులని
నవ్వే నడకని కనిపించే శ్వాసని
ఇచ్చిపుచ్చుకున్న మనసుని
ఇదా అదా యధావిధా మరి

ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయిని
తనువున తొణుకుతున్న చురుకుని
మనసున ముసురుకున్న చెమటని

ఇష్టకష్టాలని ఏమంటారో ఇపుడేమంటారో
ఈ మోహమాటాలని ఏమంటారో మరి ఏమంటారో
స్వల్పభారాలని ఏమంటారో ఇపుడేమంటారో
సమీపదూరాలని ఏమంటారో అసలేమంటారో

జారే నింగిని దొరలాంటి దొంగని
పాడే కొంగుని పరిమళించే రంగుని
పొంగుతున్న సుధాగంగని
ఇదా అదా అదే ఇదా మరి

ఏమంటారో మారిపొతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

జాబిలై తళుకుమన్న చుక్కని
బాధ్యతై దొరుకుతున్న హక్కుని hey hey
దేవుడై ఎదుగుతున్న భక్తుని
సూత్రమై బిగయనున్న సాక్షిని

పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఏమంటారో ఇపుడేమంటారో
గతజన్మలో అప్పుని ఏమంటారో అసలేమంటారో

నాలో నువ్వుని ఇక నీలో నేనుని
మాకే మేమని మన దారే మనదని
రాసుకున్న ఆత్మచరితని
అదా ఇదా ఇదే అదా మరి

ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపొతున్న కథని
ఏమంటారో జారిపొతున్న మతిని



Credits
Writer(s): Chandrabose, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link