Bapu Gari Bommo (From "Attarrintiki Daaredi")

హేయ్ బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో

Rubber-u గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
Ribbon-u కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ

అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో Old Monk rum'o
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది

అమ్మో బాపు గారి బొమ్మో
హే, ఓలమ్మో మల్లెపూల కొమ్మో

మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా

నిన్న coffee glass-u చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది
పొద్దు పొద్దున్నే hello అంటుందీ
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో

(సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ)

యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ

ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది

తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో



Credits
Writer(s): Devi Sri Prasad, Ramajogaiah Darivemula
Lyrics powered by www.musixmatch.com

Link